Header Banner

ప్రతి నెల 3వ శనివారం ఏపీలో స్వచ్ఛ ఆంధ్ర.. ఎక్కడికక్కడ ఇ-వేస్ట్ సేకరణ కేంద్రాలు!

  Fri Apr 18, 2025 21:17        Politics

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. ప్రతి నెల 3వ శనివారం రోజున రాష్ట్రవ్యాప్తంగా 'స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందుకోసం వివిధ థీమ్ లను అనుసరిస్తున్నారు. ఏప్రిల్ నెల థీమ్ ను తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. "స్వర్ణాంధ్ర-2047 సంకల్పంలో భాగంగా 'స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమం ప్రతి నెలా 3వ శనివారం నాడు జరుపుకుంటున్నాం. ప్రతి కార్యక్రమం స్ఫూర్తివంతంగా ఉండేందుకు నెల నెలా ఒక్కో థీమ్ ను ఎంచుకుని నిర్వహిస్తున్నాం.

 

ఇది కూడా చదవండి: ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్.. ఎయిమ్స్‌లో 534 పోస్టుల భర్తీకి ఆదేశాలు జారీ!

 

ఈసారి 'ఈ-వ్యర్థాల సేకరణ, వాటిని సురక్షిత పద్ధతుల్లో రీసైకిల్  చేయడం' థీమ్ ను ఎంచుకోవడం జరిగింది. ఎందుకంటే చెత్త నుంచి సంపద సృష్టించడం ద్వారా సర్క్యులర్ ఎకానమీ సాధ్యం అవుతుంది. ఈ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి అధికారులు, జిల్లా కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎన్జీఓలు, కార్పొరేట్ సంస్థలు, విద్యార్థులు, యువత స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరుతున్నాను. ఎక్కడికక్కడ ఇ-వేస్ట్ సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయండి. వీటి నిర్వహణకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఎస్‌హెచ్‌జి సభ్యులను గుర్తించి.. వారి సేవలను వినియోగించుకోండి.  'రెడ్యూస్, రీయూజ్, రీ సైకిల్" అనేది ఈ - వేస్ట్ కలెక్షన్ సెంటర్ల నినాదం కావాలి. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసి తద్వారా  స్వర్ణాంధ్ర సంకల్పాన్ని మరింత ముందుకు వెళ్లే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవుతారని ఆశిస్తున్నాను" అని చంద్రబాబు పిలుపునిచ్చారు. 

 

ఇది కూడా చదవండి: జగన్ గుండెల్లో గుబులు.. వలసబాటలో వైఎస్సార్సీపీ మాజీ మంత్రి రోజా! పార్టీలోకి అడుగు..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బీజేపీ నుంచి టీడీపీకి గవర్నర్ ఆఫర్.. చంద్రబాబు ఎంపికపై ఉత్కంఠ! ఆ ఇద్దరి పేర్లు లిస్ట్ లో..!

 

అమరావతిలో అభివృద్ధికి శ్రీకారం.. మోదీ పర్యటనకి గ్రాండ్ వెల్‌కమ్! రైతులు పూలతో ప్రత్యేక స్వాగతం!

        

ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం! 57 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం.. 6 సమాంతర రన్వేలు!

 

మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్! డాక్టరేట్ పెద్ద దుమారమే.. నెట్టింట చర్చ!

 

బ్రేకింగ్ న్యూస్! సిట్ విచారణకు సాయిరెడ్డి! వెలుగులోకి వస్తున్న కీలక సమాచారం!

 

వైసీపీకి ఊహించని షాక్! పాలేటి కృష్ణవేణికి 14 రోజుల రిమాండ్!

 

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని దుర్మరణం! మృతదేహ రవాణకు కేంద్ర మంత్రి కృషి!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ సన్నాహాలు!

 

నేడు (18/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations